కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు.

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంతో పాటు క్యాంప్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి, గాంధీ పార్క్ లో మహాత్ముని విగ్రహానికి, మహామ్మద్ అబ్దుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు దేశ స్వాతంత్రం కోసం చేసిన సేవలను కొనియడారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. దేశం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లూరి మల్లారెడ్డి, దశరథ రాజేశ్వర్, ఎంబడి రాజేశ్వర్, వాజీద్ అహ్మద్, అజహార్, జునైత్, చిన్ను, మతిన్, సబా కలీం, ఖీజర్, జయంత్ పటేల్, కొట్టే శేఖర్, కొంతం గణేష్, గంగోని భూరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking