ఘనంగా ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 2

జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధాశ్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలను ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనాధ పిల్లలతో కేక్ కట్ చేయించి, వారికి అల్పాహారం, పండ్లు మరియు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ వెంకట్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి విద్యార్థి స్థాయి నుండి చేసిన సేవలు మరియు విద్యార్థులు, నిరుద్యోగుల కోసం చేసిన త్యాగాలు మరవలేనివని మరియు కరోన సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆనాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వంతో విద్యార్థుల కోసం కోట్లాడి పక్కటి యముకులు విరిగిన కాని పోరాటం ఆపకుండ కొనసాగించారు.పలు మార్లు ఆనాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఎన్ని సార్లు జైలుకు పంపించిన అదరకుండ బెదరకుండా విద్యార్థుల నిరుద్యోగుల కోసం పోరాడిన తీరు హర్షనీయమని కొనియాడారు.
వెంకట్ చేసిన సేవలను గుర్తించి స్వయంగా రాహుల్ గాంధీ ఎమ్మెల్సీ పదవిని ఇస్తే యువకులకు ప్రోత్సాహం, మనో ధైర్యం ఉంటుందని ఆలోచించి పెద్దల సభకు చిన్న వాడిని పంపించారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్, హుజురాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎం.డి. జియఉల్ అలీ,అరుణ్ కుమార్, నిఖిత్,రామ్ చంద్ర, అశోక్, అఖిల్, దీపక్, విష్ణు,రమేష్, శ్రీను, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking