రెండు రోజుల్లో ధాన్యం తూకం వెయ్యకపోతే..!

మెదక్ -సంగారెడ్డి ప్రధాన రహదారిని దిగ్బంధం చేస్తాం..!

ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్

ప్రజాబలం కొల్చారం మండలం నవంబర్ (04)

కొల్చారం మండల సంగాయిపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం రోజు ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ, వరి కోసి 20 రోజులు అవుతున్న, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చెయ్యకపోవడం, మరియు అకాల వర్షాలు పడడంతో రైతులు చాలా భయాందోళనకు గురవుతూ చాలా అవస్థలు రైతులు ఎదుర్కొంటున్నారని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
రెండు రోజుల్లో ధాన్యం తూకం వేసి కొనుగోలు చేయకపోతే, సంగారెడ్డి- మెదక్ ప్రధాన రహదారిపై, సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ, రోడ్డు దిగ్బంధం, చేసే అవసరం ఉంటుందని, వారు తెలిపారు,
కాబట్టి తక్షణమే ధాన్యం కొనుగోలు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎర్రోళ్ల సంజీవయ్య, రైతులు, దేవయ్య లక్ష్మయ్య భూమయ్య, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking