హాజరైన ప్రముఖులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు.
ప్రారంభ ఆఫర్ లో 50 వేల స్మార్ట్ టివి కొనుగోలు చేసిన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అఫ్సర్ భాయ్, బుడ్డ భాగ్యరాజు.
మెదక్ తూప్రాన్, ఎప్రిల్, 30. ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ వ్యాపార రంగంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాలతో దినదిన అభివృద్ధి చెందుతుంది.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ఆధునిక యుగంలో మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్‌బే, యజమాన్యం చేతుల మీదుగా మంగళవారం ఉదయం తూప్రాన్ పట్టణంలోనీ నర్సాపూర్ చౌరస్తా సమీపంలో దేశ గ్రామ ప్రజలకు సాధ్యమైనంతవరకు తమ సర్వీస్ సేవలను అందించాలని ఉద్దేశంతో గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేత్రీ టైర్స్ లోకల్ సిటీ మున్సిపాలిటీలో ప్రారంభించేందుకు సిద్ధమయ్యామని ఈ సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో తన కొత్త షోరూమ్‌ను కస్టమర్ల కోరిక మేరకు ఘనంగా హట్టహసంగా ప్రారంభించింది. మొదటి రోజు ప్రారంభ ఆఫర్ లో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అఫ్సర్ భాయ్, బుడ్డ భాగ్యరాజు లు కలిసి 50 వేల రూపాయలు చెల్లించి స్మార్ట్ టివి కొనుగోలు చేసి భోని కొట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఇంత పెద్దఎత్తున అద్భుతమైన సెల్‌బే షోరూమ్‌ను ప్రారంభించేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు సెల్‌బే మేనేజ్‌మెంట్‌ను సర్వత్ర అభినందించారు. ఈ సందర్భంగా సెల్ బే యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ తూప్రాన్ ప్రజలకు సకల సౌకర్యాలతో కూడిన సెల్‌బే షోరూమ్‌ను ఏర్పాటు చేయడం గొప్ప సువర్ణఅవకాశం అని అన్నారు. ఇది మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, స్పెర్ పార్ట్స్, ఉపకరణాలు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు మరియు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల యొక్క అన్ని అవసరాలను తీరుస్తుందనీ తెలిపారు. గజ్వల్ నియెజకవర్గం తూప్రాన్ మరియు పరిసర గ్రామాల ప్రజలందరూ సెల్‌బే షోరూమ్‌ని సందర్శించి వారికి ఇష్టమైన మొబైల్ హ్యాండ్‌సెట్ స్మార్ట్ టీవీ లేదా ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలని మరియు ప్రారంభ ఆఫర్‌లను పొందాలని వారు కోరారు. బ్రాండెడ్ నెక్ బ్రాండ్, కేవలం రూ. 99/- మొదటి మూడు వేలు కస్టమర్లకు, ఆండ్రాయిడ్ టీవీ ప్రారంభ ధర కేవలం రూ. 7999/-, కొన్ని ప్రత్యేక బ్రాండెడ్ టీవీ లతో సౌండ్ బార్ విత్ ఉఫర్ ఉచితంగా లభిస్తుందన్నారు. అలాగే కేవలం రూ. 5999/- కి ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్ లభిస్తుందన్నారు. మరియు ప్రతి ఒక్కరి డ్రీమ్ ఐ ఫోన్ నెలవారీ ఈ ఎం ఐ లో కేవలం రూ. 2705/- కె పొందవచ్చు అన్నారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలు పై ఒక ఖచ్చితమైన బహుమతి, అదే విధంగా రూ.15000/ పై స్మార్ట్ ఫోన్ కొనుగోలు పైన Rs.2499/- విలువగల బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ఉచితంగా లభిస్తాయని చెప్పారు. అనంతరం సెల్‌బే సంస్థ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు, సేల్ బే యాజమాన్యం సుహాస్ నల్ల చెరువు మాట్లాడుతూ అత్యుత్తమ ఉత్పత్తులు మరియు సేవలను అందించడం ద్వారా తమ గౌరవనీయమైన వినియోగదారులకు అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని అందించడంలో సెల్‌బే ఎల్లప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పారు. ఇది తన వినియోగదారులకు అమ్మకాల తర్వాత ఉత్తమ సేవలను కూడా అందిస్తుంది. అర్హతగల కస్టమర్లు మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ఫైనాన్స్ ఆప్షన్‌లను పొందవచ్చని ఆయన చెప్పారు. కంపెనీ తన సేవలను దక్షిణ భారతదేశంలోని మూల మూలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే 3 టైర్ నగరాల్లోకి ప్రవేశించడం ప్రారంభించిందని తెలిపారు. ఇందులో భాగంగా తూప్రాన్ అటువంటి చొరవలో ఒకటి సెల్‌బే షోరూమ్ ప్రారంభించామని అన్నారు. క్షియోమి, రియల్మి, సాంసంగ్, వివో, ఒప్పో, వన్ ప్లస్, పోకో, అప్పీల్, మొదలైన అనేక రకాల మొబైల్ మరియు స్మార్ట్ టీవీ బ్రాండ్‌లకు సెల్‌బే వన్ స్టాఫ్ హబ్ అని తెలిపారు. అనంతరం సెల్ బే యజమాన్యం సుహాస్ నల్లచెరు,వివో జనరల్ మేనేజర్ శ్రీ అతీష్ భార్గవ్ మాట్లాడుతూ తన కస్టమర్‌లను చేరుకోవడంలో సెల్‌బే పాత్ర గురించి మరియు ఎప్పటికప్పుడు మెరుగైన రీతిలో సేవలను విస్తరించడం గురించి వివరించారు. ఈ ప్రక్రియలో భాగంగా, తూప్రాన్ పట్టణంలో సొగసైన వాతావరణంతో ప్రారంభించబడిందనీతెలిపారు. సెల్‌బేలో మొబైల్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉందని, అన్ని ఉత్పత్తులు నిజాయితీ ధరలకే లభిస్తాయని గర్వంగా చెప్పారు. మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఉపకరణాలు మరియు అందుబాటులో ఉన్న ఉత్తమ ప్రారంభ ఆఫర్‌లను కొనుగోలు చేయడానికి వినియోగదారులందరూ కొత్త షోరూమ్‌ను సందర్శించాలని ఆయన అభ్యర్థించారు. సెల్‌బే ఎల్లప్పుడూ కస్టమర్ సర్వీస్ కు ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే తమ స్టోర్ పరిసరాల్లో ఉచిత హోమ్ డెలివరీ సౌకర్యం ఉందని చెప్పారు. అనంతరం సెల్‌బే మార్కెటింగ్ డైరెక్టర్ సుదీప్ నల్లచెరు మాట్లాడుతూ కస్టమర్ కొనుగోలు విధానం కొత్త పోకడలను అనుసరిస్తుందని వారికీ అనుగుణంగా తమ మార్కెటింగ్ స్ట్రాటజీ మలుచుకుంటున్నామని చెప్పారు. అందులో భాగంగా సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ పద్ధతులు అనుసరిస్తున్నామని చెప్పారు . కార్యక్రమం లో వివో జనరల్ మేనేజర్ శ్రీ అతీష్ భార్గవ్ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ క్షియోమి హెడ్ అన్వార్, ఫైనాన్స్ సంస్థ అధికారులు, సెల్ బే మీడియా పిఆర్ఓ గోపి , టీమ్ సభ్యులు, బ్రాండ్స్ అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రాజప్రతినిదులు, గ్రామస్తులు కస్టమర్‌లు గ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
