ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ర్యాంకును సాధించడంతో అధికారులను కలెక్టర్ అభినందించారు. నిర్మల్ జిల్లా 99.09%తో ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిందని, ఇది ఎంతో గొప్ప విషయం అని తెలిపారు.వరుసగా రెండోసారి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలవడం గొప్ప విషయం అని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8923 మంది పదవ తరగతి పరీక్ష రాయగా అందులో 8823 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవడానికి కృషి చేసినటువంటి డిఈఓ రవీందర్ రెడ్డి, ఇతర విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఫలితాలు ముందు వరుసలో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఉత్తమ ఫలితాలు రావడానికి కృషి చేసిన డిఈఓ రవీందర్ రెడ్డిని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శాలువాతో సన్మానించారు. రానున్న రోజుల్లో కూడా మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీఈఓ రవీందర్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు,ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు