రెజొనెన్స్‌ స్కూల్‌ శ్రీనగర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 8 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని స్థానిక శ్రీనగర్‌ కాలనీలో గల రెజొనెన్స్‌ స్కూల్‌లో తెలుగు సంవత్సరాది (ఉగాది) వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది రెజొనెన్స్‌ స్కూల్‌ శ్రీనగర్‌లో తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన తెలుగు సంవత్సరాది ఐన ఉగాది పండుగను విద్యార్థులు నూతన వస్త్రాలు ధరించి, మామిడి తోరణాలను తరగతి గదులకు అలంకరించి, నవ వసంతాన్ని స్వాగతిస్తూ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తమ స్నేహితులకు, ఉపాధ్యాయులకు పంచుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ తమ స్వచ్చమైన మనస్సుతో ఆనందతన్మయత్వం చెందారు. చిరునవ్వులను చిందిస్తూ ఎంతో ఉత్సాహంగా కేరింతల నడుమ ఉగాది పండుగను జరుపుకోవడం జరిగింది పంచాంగ శ్రవణం ఎంతో ఆకట్టుకున్నది ఈ కార్యక్రమములో స్కూల్‌ డైరెక్టర్‌ కొండా శ్రీధర్‌ రావు పాల్గొని మాట్లాడుతూ యుగానికి నాంది ఉగాది అంటూ ప్రతి సంవత్సరం చైత్రశుద్ద పాడ్యమి నాడు ఎంతో భక్తిశ్రద్ధలతో తెలుగువారందరూ జరుపుకునే తొలి పండుగ అంటూ తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఆరు రుచుల కలయికతో ఉగాది పచ్చడి చేసి కుటుంబమంతా సేవించి, ఆ ఆరు రుచులను జీవితంలో వచ్చే కష్టసుఖాల కలయికగా భావించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొగల వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకోవాలి అని తెలియజేసారు. షడ్రుచుల మాదిరిగా రెజొనెన్స్‌ స్కూల్‌ శ్రీనగర్‌లో నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, వినయం, ఆటలు, సంగీతం, కంప్యూటర్‌ విద్యల జ్ఞానాన్ని అందిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ఉన్నతమైన ప్రణాళికను నిర్వహిస్తున్నామంటూ మన పండుగలు మరియు సంసృతులను మనం తెలుసుకోవాలంటూ వివరిస్తూ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమములో డైరెక్టర్‌ కొండా కృష్ణవేణిపాల్గొని, ప్రతి విద్యార్థికి తమ జీవితంలో జయా పజయాలు కష్టసుఖాలు, మంచి చెడులు ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల సమ్మేళనం వలే ఉంటాయని పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు యం.ప్రసన్నరావు ఉపాధ్యాయులు ఉపాధ్యేయేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking