రానున్న రెండు నెలలు పక్కా ప్రణాళికతో త్రాగునీటి సరఫరా చేపట్టాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

భద్రాది కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 8 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తో గూడెం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రిడ్ నుంచి నీటి సరఫరా, రోజువారి నీటి డిమాండ్ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు నీటి శుద్ధి ప్రక్రియలోని దశలను పరిశీలించారు. వేసవి కాలం ప్రతీ ఇంటికి నల్లానీరు చేరేలా చర్యలు తీసుకోవా లన్నారు. నీటి శుద్ధి కేంద్రాల నుంచి నీరు సర ఫరా జరిగేలా మిషన్‌ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే రెండు నెలలు చాలా కీలకమని నీటి సరఫరా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ ఏ ఈలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మిషన్ భగీరథ నుంచి నీటి సరఫరా లేని ప్రాంతాలకు స్థానిక వనరులు బావులు, బోర్లు ద్వారా నీళ్లు అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. వాటర్ ట్యాంక్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి చుట్టూ క్లోరినేషన్ చేయాలని గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న చేతి పంపు, మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలకు మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు నీరు అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్ పాల్వంచ మున్సిపల్ ఇంజనీర్ లు పాల్వంచ ఎమ్మార్వో మరియు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు

   

Leave A Reply

Your email address will not be published.

Breaking