కార్యకర్తలే దిశా నిర్దేశకులు

 

వారి అండతో గెలుస్తా..

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా

నామ జీవితం తెరిచిన పుస్తకం : తాతా మధు

అజాత శత్రువు నామ తాతా మధు

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం చిమ్మపూడి లో నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన బీఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తల ఎన్నికల సన్నాహాక సమావేశంలో నామ నాగేశ్వరరావు , తాతా మధు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 08 (ప్రజాబలం) ఖమ్మం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు కంకణ బద్ధులై అందరూ కలిసి మెలిసి పని చేసి, తన విజయానికి కృషి చేయాలని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.రఘునాధపాలెం మండలం చిమ్మపూడి లో నామ విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశంలో నామ , ఎమ్మెల్సీ తాతా మధు తో కలిసి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ గొంతుకై తెలంగాణ ప్రయోజనాలు సాధించేందుకు బీఆర్ ఎస్ ఎంపీ లు గెలిపించుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు ఏనాడు జిల్లా గురించి గాని రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. కేంద్రం నల్ల చట్టాలు తీసుకొచ్చి, మీటర్లు పెట్టాలని చూస్తే కోట్లాడి అడ్డుకున్నానని అన్నారు. తనను గెలిపించి పార్లమెంట్ కు పంపి కేసీఆర్ కు అండగా నిలవాలని నామ కోరారు .జిల్లాలో రూ.8వేల కోట్ల విలువైన రాష్ట్ర రహదారుల ను జాతీయ రహదారులుగా మార్చాను. వీటిలో కొన్ని ఇప్పటికే పూర్తి కాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయని చెప్పారు. పార్లమెంట్ లో రాష్ట్ర ప్రయోజనాలు కోసం కొట్లాడే సత్తా ఒక్క బీఆర్ఎస్ ఎంపీ లకే సాధ్యమని అన్నారు. కష్టకాలంలో కేసీఆర్ కు అందరం. మద్దతుగా నిలుద్దామని అన్నారు.

మీ అందరి కృషి వల్లనే గతంలో మంచి మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే ఉత్తమ పార్లమెంటేరియన్గా రాష్ట్రానికి పేరు తెచ్చానని అన్నారు. మళ్లీ ఇప్పుడు కూడా గెలిపిస్తే మరింత అభివృద్ధి ని సాధిస్తానని అన్నారు పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ నామను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే రాబోయే ఐదేళ్లు కార్యకర్తలకు, ప్రజలకు కొండంత అండగా ఉంటారని అన్నారు. నామ జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. నామ అజాత శత్రువు అన్నారు. అందరి వాడని, మంచి మెజార్టీతో గెలిపించుకోవడం ద్వారా కేసీఆర్ కు మద్దతుగా నిలవాలన్నారు .నామను గెలిపించుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అండగా ఉంటారని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నామ నాగేశ్వరరావు గెలుపు మనందరి బాద్యత అన్నారు. నామ అంటే పోరాట స్ఫూర్తి అన్నారు. ఎంపీ గా విభజన సమస్యలపైన, రాష్ట్రానికి రావసిన నిధులు, ప్రాజెక్టుల గురించి కోట్లాడి ఎన్నో సాధించారని అన్నారు పార్టీ నాయకులు గుత్తా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు తో పాటు రఘునాధ పాలెం మండల అధ్యక్షులు వీరూ నాయక్, నాయకులు తాళ్లూరి జీవన్, కుర్రా భాస్కర్ రావు, మద్దినేని వెంకట రమణ , హరిప్రసాద్ , మెంటెమ్ రామారావు, వెంకటేశ్వర్లు, దొంతు సత్యనారాయణ, గొర్రె శ్రీను, దేశిగాని నర్సయ్య, చెన్నబోయిన సైదులు,భద్రయ్య, కోటేశ్వరరావు, ముత్తయ్య, గంగిరెడ్డి విజయారెడ్డి,నామ సేవా సమితి నుంచి తాళ్లూరి హరీష్ తో పాటు చిమ్మపూడి, కోటపాడు, కోయచెలక, రేమిడిచెలక, పాపటపల్లి, జీకే బంజర తదితర గ్రామాల నాయకులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking