మెదక్ లో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం. ఘనంగా పూజలు. హాజరైన ప్రజాప్రతినిధులు.

 

మెదక్ డిసెంబర్ 13 ప్రాజబలం న్యూస్ :-

మెదక్ పట్టణంలోని రామాలయంలో, వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి(వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం)సందర్భంగా జరిగిన
పల్లకి సేవ, ఆరాధన, కోలాటం వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సతి సమేతంగా పాల్గొని సీతారామ స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన
ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి. ఈ సందర్భంగా సతీ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి గారిని రామాలయ కమిటీ సాదరంగా ఆహ్వానించింది. ఎమ్మెల్సీ శేరీ దంపతులను కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో గౌరవంగా సన్మానించి జ్ఞాపికలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మునిసిపల్ చైర్ పర్సన్ తొడుపునూరి చంద్రపాల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ కౌన్సిలర్లు మధుసూదన్ రావు గాయత్రి గౌడ్ రాగి వనజ కృష్ణ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,సర్పంచులు మహిపాల్ రెడ్డి శీను నాయక్, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking