గంగా కావేరి సీడ్స్ వారి సూపర్ బోల్ ప్లస్ సీడ్స్ పైన క్షేత్ర స్థాయి పరిశీలన

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 23: మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు గ్రామంలోని ఆకుల వేంకటేశ్వర్లు పత్తి చేనులో గంగా కావేరి సీడ్స్ కంపెనీ యొక్క మంచిర్యాల సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎస్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షేత్ర స్థాయి పరిశీలన శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ ఎస్ ఎమ్ గాలి రవీందర్,తోపాటు చుట్టూ పక్కల గ్రామాలలోని 216 మంది రైతులు పాల్గొన్నారు.ఏ ఎస్ ఎమ్ గాలి రవీందర్ మాట్లాడుతూ… గంగా కావేరి సీడ్స్ వారి సూపర్ బోల్ ప్లస్ అనే పత్తి విత్తనాలు నాణ్యమైనవని,రైతుకు అధిక దిగుబడి తీసుకువచ్చే విధంగా గంగా కావేరి సీడ్స్ రూపొందిస్తుందని అన్నారు.జీకే సూపర్ బోల్ ప్లస్ అనే రకం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఏపుగా పెరిగి ఎక్కువ కొమ్మలతో కలిగివుంటుంది,చెట్టు నిండా పెద్ద పెద్ద కాయలతో కలిగి చిక్కటి కాపు,నాణ్యత పింజ,సస్యరక్షణ ఖర్చు తక్కువ,సులభంగా, కూలీల ఖర్చు ఆదా,పెద్ద పెద్ద కాయలతో వుండటం వల్ల ఎక్కువ పత్తి దిగుబడి వస్తుంది అన్ని అన్నారు.ఈ విత్తనం యొక్క ప్రాధాన్యత వివరిస్తూ అంతేకాకుండా ఈ రకం సీడ్స్ విత్తనాలు అన్ని రకాల చీడ పిడల నుండి తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది అని అన్నారు.వచ్చే పంటకు గంగా కావేరి సీడ్స్ వారి సూపర్ బోల్ ప్లస్ అనే పత్తి విత్తనాలను వేసుకోవాలని సూచించారు. మేలు రకమైన విత్తనాలు వేసుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమనికి చుట్టూ పక్కల13 గ్రామాలు కొత్తూరు,ఎల్లారం, వెంకటరావుపేట్,తోట గూడెం, ఎలుకలపల్లి,గూడెం,రాసపల్లి, గంపనపల్లి, కొమ్ముగూడెం, రాజంపేట,ముత్యంపేట, గ్రామంలో రైతులతోపాటు,డీలర్స్ శ్రీ రాజరాజేశ్వర ట్రేడర్స్ నరేందుల ప్రభాకర్,అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking