మాల మహానాడు మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య
ప్రజా బలం దినపత్రిక మెదక్ జిల్లా నిజాంపేట్
23.09.2024:
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా మాల మహానాడు భవనం లేకపోవడంతో సభా సమావేశాలు జరుపుకోవడానికి ఇబ్బందిగా ఉందని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా మాల మహానాడు భవనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు