ప్రజావాణికి 65 ఫిర్యాదులు

 

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించిన్న

….జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి సెప్టెంబర్ 23 ప్రజ బలం ప్రతినిధి:
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు అందాయని జిల్లా కలెక్టర్ తెలిపారు . జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ , ట్రై నీ కలెక్టర్ మనోజ్ , డి ఆర్ ఓ పద్మజ రాణి లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking