డంపింగ్ యార్డ్ తరలింపు దీక్షలకు పలు సంఘాల సంఘీభావం

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక దానవాయిగూడెం ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను తరలించాలని గత నాలుగు రోజులుగా పార్టీలకతీతంగా డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలకు సోమవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక , వీరనారీమణుల ఆశయ సాధన సమితి లు సంఘీభావం ప్రకటించాయి . ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు బానోతు బద్రు నాయక్ , వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి , జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడాల ఝాన్సీ , ఉపాధ్యక్షురాలు త్రివేణి , గౌరవ సలహాదారులు పుల్లూరు నాగయ్య లు ఈ సందర్భంగా మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వల్ల స్థానిక ప్రజానీకం పడుతున్న బాధలను వెల్లడించారు . ప్రజల కోరిక మేరకు ఇక్కడి నుండి డంపింగ్ యార్డ్ ను తరలించాలని డిమాండ్ కార్యక్రమంలో వీరనారీమణుల ఆశయ సాధన సమితి నాయకులు భవాని , జ్యోతి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking