స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ
వరద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు
నా ఖమ్మం కోసం నేను కార్యక్రమం క్రింద 2.75 క్వింటాళ్ల బియ్యం, పప్పు, 20 వేల రూపాయలు నగదు విరాళం అందజేత
గ్లోబల్ హై స్కూల్ విద్యార్థులను ఉపాధ్యాయుల ను అభినందించిన అదనపు కలెక్టర్
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 23 (ప్రజాబలం) నా ఖమ్మం కోసం నేను కార్యక్రమానికి వచ్చిన విరాళాలను జవాబుదారీతనంతో వినియోగిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు సోమవారం నా ఖమ్మం కోసం నేను అనే నినాదంతో వరద బాధితుల సహాయార్థం నాగులవంచకు చెందిన శ్రీ గ్లోబల్ హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు, కళాశాల చైర్మన్, డైరెక్టర్, ఉపాధ్యాయులతో కలిసి సేకరించిన 2.75 క్వింటాళ్ల బియ్యం, పప్పు, వంట నూనె, ఇతర సామాగ్రి, 20 వేల రూపాయల నగదును జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ కు అందజేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ ఖమ్మంలో వచ్చిన వరదల నేపథ్యంలో బాధితులకు సహాయం చేసేందుకు ఖమ్మం ప్రజలు ముందుకు వచ్చేలా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆలోచన మేరకు నా ఖమ్మం కోసం నేను అనే వినూత్న కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని అన్నారు వరద బాధితుల సహాయార్థం గ్లోబల్ హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు ముందుకు రావడం చాలా ప్రశంసనీయమని, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు నా ఖమ్మం కోసం నేను అని చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, పౌరుల నుంచి ఇప్పటి వరకు 14 లక్షల రూపాయలు, కొన్ని టన్నుల ఆహారపు సామాగ్రి విరాళం క్రింద వచ్చాయని అన్నారు నా ఖమ్మం కోసం నేను కార్యక్రమం క్రింద వచ్చిన విరాళాలను వరద బాధితుల విద్య, వైద్యం కోసం వినియోగించడం జరుగుతుందని తెలిపారు. విరాళం క్రింద వచ్చిన ప్రతి రూపాయిని ఎలా వినియోగిస్తున్నామో జవాబుదారీతనం తో తెలియజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ దీక్ష రైనా డిఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.