ఉపాధ్యాయుల కొరతతో మానవహారం నిర్వహించిన విద్యార్థులు
ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం
23.09.2024:
మెదక్ జిల్లా నిజాంపేట మండల పట్టణ కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాలలో గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయుల కొరత ఉంది. ఈ ఉపాధ్యాయుల కొరత ఉండటంతో పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మానవహారం నిర్వహించి నిరాసన తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 250 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండటంతో సరిగ్గా చదువుకోలేకపోతున్నామని విద్యార్థులు తెలిపారు, గతంలో ఎన్ని మంది టీచర్లు ఉండేవారని అధికారులు వెంటనే స్పందించి ఉపాధ్యాయులను భర్తీ చేసి నాణ్యమైన విద్యను అందించాలని కోరారు