బాక్స్ కల్వట్టుకు నిధులు మంజూరు చేయండి జిహెచ్‌ఎంసి కమిషనర్ ఇల్లంభర్తిని IAS నీ కోరిన విజయేందర్ రెడ్డి
ఉప్పల్ ప్రజాబలం ప్రతినిధి: రామంతపూర్ బాగాయత్ వెంకట సాయి నగర్ కాలనీ బీరప్ప దేవాలయం వెనకాల మూసినాలపై బాక్స్ కలవర్ట్ కు నిధులు మంజూరు చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ ఇళ్లంబర్తి %IAూ% ని కోరి వినతి పత్రం అందజేసినా ఏ.విజయేందర్ రెడ్డి. వెంకట సాయి నగర్ కాలనీ ప్రజలు వారి గమన స్థానాలకు చేరాలంటే ఒకటి కెసిఆర్ నగర్ కాలనీ నుంచి అయినా వెళ్లాలి లేదా సాయి కృష్ణ నగర్ కాలనీ నుంచి అయినా వెళ్లాలి అలాగే వివిధ కాలనీ నుంచి బీరప్ప దేవాలయానికి వచ్చే భక్తులకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని వర్షాకాలంలో హబ్సిగూడ నుంచి వరద నీరు అంతా కూడా మూసిలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వరద తీవ్రతను తట్టుకునే విధంగా బాక్స్ కల్వర్టు సాంక్షన్ చేస్తే ఆ నీరు అంతా కూడా మూసిలో కి వెళ్లే అవకాశం ఉందని లేకపోతే ఆ త్రీవత పెరిగితే లోతట్టు ప్రాంతం అయినటువంటి మా కాలనీలకు నీరు చేరే అవకాశం ఉందని జిహెచ్‌ఎంసి కమిషనర్ ఇళ్లంబర్తి కు వివరించారు . జిహెచ్‌ఎంసి కమిషనర్ మాట్లాడుతూ కాలనీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా తగు చర్యలు చేపడతామని తప్పకుండా కల్వట్టుకు నిధులు మంజూరు చేస్తామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఆర్ గోవింద్, సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, జి.అశోక్, నవీన్, ఐలేష్ యాదవ్,పరశురాం,తదితరులు పాల్గొన్నారు