కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చారిత్రాత్మకం

 

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోట రాంబాబు

మాదిగల దామాషా ప్రకారం 11 శాతం రిజర్వేషన్ లను అమలు జరపాలి

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 5 (ప్రజాబలం) ఖమ్మం మూడు దశాబ్దాల కాలంగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో సమన్యాయం సామాజిక న్యాయం ఉందని సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు అన్నారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కోటా రాంబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాలకు చెందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీలోని 59 ఉపకులాలకు దామాషా ప్రకారం సమన్యాయం సామాజిక న్యాయంకోసం జరుగుతున్న పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం చారిత్రాత్మకమన్నారు ఏక్ సభ కమిషన్ జస్టిస్ షమీం అక్తర్ రిపోర్ట్ సబ్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనర్సింహ పొన్నం ప్రభాకర్ సీతక్కా సహకారంతో ఎస్సీ వర్గీకరణను చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారని జైలు పాలయ్యారని అయినప్పటికీ ఉద్యమాన్ని ముందుకు నడిపి వర్గీకరణ విజయాన్ని ముద్దాడిన మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్నకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానన్నారు ఎస్సీ వర్గీకరణలో మాదిగ, మాదిగ ఉపకులాలకు 9శాతం కాదు దామాషా ప్రకారం 11శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు . ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు వేల్పుల నరసింహారావు నాయకులు ఎర్రగుట్ట రమేష్ లంకా వెంకటేశ్వర్లు ఊదగాని రంజిత్ గుండ్ల రత్నబాబు కనకం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking