-లాటరీ పద్ధతిలో బ్లాక్, ఇంటి నంబర్ ఎలాట్
-మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 8:
అర్హులైన పేదలను సర్వే ద్వారా గుర్తించి వారినే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎంపిక చేసినట్లు మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సి.ఈ.ఆర్ క్లబ్ లో ఏర్పాటుచేసిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిజమైన అర్హులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేస్తున్నామని ఏవైనా అవకతవకలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. అనంతరం మందమర్రి తహసిల్దార్ పనకంటి సతీష్ కుమార్ మాట్లాడుతూ నిజమైన పేదలకు న్యాయం జరగాలనేది తమ అభిమతమని ఇండ్లు రాని వారు ఎవరైనా ఉంటే వారికి వార్డ్ సమావేశాలు నిర్వహించి రెండో విడతలో లబ్దిదారులకు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల చేత లక్కీ డ్రా ద్వారా నిర్వహించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నెంబర్, బ్లాక్ ను అలాట్ చేశారు. మొత్తం 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గాను మొదటి విడతగా 243 మంది అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈకార్యక్రమంలో హౌసింగ్ పీడీ బన్సీలాల్ మందమర్రి మున్సిపల్ కమిషనర్ నీలిగొండ వెంకటేశ్వర్లు, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై శివనీతి రాజశేఖర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.