ప్రజలందరికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు….సత్యం శ్రీరంగం

 

కూకట్పల్లి (ప్రజబలం) మార్చ్ 29 :
ఉగాది పర్వదినం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, ప్రజలందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని టీపీసీసీ అధికార ప్రతినిధి డా.సత్యం శ్రీరంగం ఆకాక్షించారు. షడ్రుచుల సమ్మేళనమయిన ఉగాది పచ్చడి మన సంస్కృతీ, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ఆహారపు అలవాట్లకు అద్దం పడుతుంది అన్నారు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో ప్రతీ ఒక్కరి జీవితం కొత్త ఆశలు ఆశయాలు, ఆలోచనలతో నవ వసంతం ఆనందమయం కావాలని ఆశిస్తూ, ప్రజలందరికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని, ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తుందని,భవిషత్యులో పేద ప్రజలందరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking