దివ్యాంగుల ఆత్మగౌరవమే ప్రజా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.

 

 

దివ్యాంగులలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాల పంపిణీ.

రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

**

ములుగు జిల్లా. దివ్యాంగుల ఆత్మగౌరవమే ప్రజా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని, దివ్యాంగులలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాల పంపిణీ చేస్తున్నట్లు
రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు.

శనివారం ఏటూరునాగారం మండల కేంద్రం లోని గిరిజన భవన్ లో జిల్లా సంక్షేమ అధికారిణి కూచన శిరీష అధ్యక్షతన దివ్యాంగులకు వివిధ
రకాల సహాయ ఉపకరణాలు అందించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దివ్యాంగులలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాల పంపిణీ చేయడం జరుగుతుందని, వారిని ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రథమ లక్ష్యం అని, అందులో భాగంగానే మన ములుగు జిల్లాలోని దివ్యాంగులకు గతం లో 4 చోట్ల ప్రత్యేకమైన శిబిరాలను నిర్వహించి దరఖాస్తులను స్వీకరించి అందులో నుండి అర్హులను ఎంపిక చేయడం జరిగిందని, ఈ అర్హులైన దివ్యాంగులకు అలింకో సంస్థ సహకారంతో సహాయ ఉపకరణాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సహాయ ఉపకరణాలను తీసుకున్న లబ్ధిదారులు పునరుత్తేజoతో తమ జీవితాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైకల్యం అనేది ఏదో ఒక్క అవయవానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి వైకల్యం ఉన్న అవయవాన్ని గురించి వేదనకు గురికాకుండా ఆరోగ్యంగా ఉన్న మిగతా అవయవాల తో ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందులో భాగంగానే వారికి ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వారికి వివిధ రకాలుగా ప్రోత్సాహకాలు, అందించడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం వంటి వివిధ సంక్షేమ పథకాల్లో 5% రిజర్వేషన్ అలాగే ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ అందించే దిశగా ప్రభుత్వం అడుగేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం దివ్యాoగుల కోసం వారు చిరు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా లోన్లు, ప్రత్యేకంగా వాహనాలను రూపొందించడం జరుగుతుందని త్వరలోనే ఆ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. దివ్యాoగులు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సేవలను వివియోగించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు కూడా సమాజం తో అన్ని విధాలా పోటీ పడాలని, వారు అన్నిరంగాల్లో స్వయం సమృద్ధి సాధించేలా సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. గతం లో అవకాశం రాని దివ్యాoగుల కోసం భవిష్యత్తులో ఈ శిబిరాలను
జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలలో నిర్వహించి వారికి కూడా సహాయ ఉపకరణాలు అందించడం జరుగుతుందని అన్నారు. దివ్యాంగులు ఈ సహాయ ఉపకరణాలను వినియోగించుకొని మరింత ధైర్యంతో వారిలోని వైకల్యాన్ని దాటి ముందడుగు వేయాలని సూచించారు.

కార్యక్రమం లో ముందుగా సభాధ్యక్షత వహించినటువంటి జిల్లా సంక్షేమాధికారిణి మాట్లాడుతూ రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించేoదుకు గతంలో జిల్లాలో ములుగు, పస్రా, ఏటూరునాగారం, కన్నాయిగూడెం లలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి దరఖాస్తులను తీసుకోవడం జరిగిందని అన్నారు.

ఆ దరఖాస్తుదారుల నుండి అర్హులైన 467 మంది లబ్దిదారులను గుర్తించి వారికి 63 లక్షల రూపాయలతో 857 పరికరాలను మంజూరీ చేయడం జరిగిందని తెలిపారు. జనవరిలో ములుగులో కార్యక్రమం నిర్వహించి పరిసర ప్రాంతాల లబ్దిదారులకు సహాయ ఉపకరణాలు అందించడం జరిగిందని, కాగా ఈ రోజు ఏటూరునాగారం గిరిజన భవన్ లో గోవిందరావుపేట, ఎస్ ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, మండలాలకు చెందిన లబ్ధిదారులకు నేడు ఇక్కడ సహాయ ఉపకరణాలను అందించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఈ శిబిరం లో 297 మంది లబ్ది దారులకు గాను సుమారు 40 లక్షల రూపాయల విలువచేసే 525 ఉపకరణాలను అందించడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా పైన తెలిపిన మండలాల నుండి అర్హులైన దివ్యాoగులకు రెట్రో ఫిట్టెడ్ ట్రై సైకిళ్ళు, చేతితో నడిపే ట్రై సైకిళ్ళు, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల స్కూటర్లు, వివిధ రకాల చేతికర్రలు మొదలగునవి, అలీంకో సంస్థ – హైదరాబాద్ వారి సహకారం తో “సామాజిక అధికారితా శివిర్” లో భాగంగా అందించడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం మంత్రి అర్హులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందచేశారు.
అనంతరం మంత్రి, కలెక్టర్ దివ్యాంగులతో కలసి భోజనం చేశారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఏటూరునాగారం ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, ఆర్ డి ఓ వెంకటేష్, ఏటూరునాగారం ICDS ప్రాజెక్టు CDPO EP ప్రేమలత, దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా & మండల స్థాయి నాయకులు పూజరి మాణిక్యం, భాస్కర్, వివిధ సెక్టార్ల ICDS సూపర్వైజర్లు,
DWO కార్యాలయ సీనియర్ & జూనియర్ అసిస్టెంట్లు, దివ్యాంగుల శాఖ సీనియర్ అసిస్టెంట్ నాగేంద్ర, FRO గణేష్, DHEW DMC రమాదేవి, వివిధ అనుబంధ విభాగాలైన DCPU, CHL, సఖి (OSC), DHEW ల సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, అలింకో సంస్థ ప్రతినిధులు సాయి, లబ్ధిదారులైన దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking