ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా తేదీ : 29-03-2025శనివారం ఐటీడిఏ ఏటూరు నాగారం సమావేశ మందిరంలో ఏటూరు నాగారం మండల పరిధి లోని 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను, ఏటూరు నాగారం లోని చైతన్య మండల సమాఖ్య మహిళ సంఘం సభ్యులకు
రూ. 86,12, 641.00 విలువ గల చెక్కును, నందిని మహిళ పొదుపు సంఘం సభ్యులకు రూ. లక్ష 50 వేల విలువ గా చెక్కును రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్ధానిక సంస్థలు సంపత్ రావులతో కలిసి పంపిణి చేశారు.