భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఆగస్టు 19 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకాన్ని ప్రజలందరికీ ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా వర్తింపచేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.
గృహలక్ష్మి పథకం ఇండ్లు లేని పేదల కోసం కేటాయించిన ప్రభుత్వం ఈరోజు కొంతమంది కొన్ని కులాలకు పరిమితమై సర్వే చేస్తున్నారని ఈ సర్వే సరైనది కాదని ఆయన అన్నారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో ఇప్పటివరకు ఇప్పుడు గృహలక్ష్మి పథకం పేరు తోటి తీసుకువచ్చి ప్రజల అయోమయానికి గురి చేస్తుందని దానికి ప్రబుత్వం బాధ్యత వహించాలని వారు అన్నారు ఈ పథకాన్ని బేధం లేకుండా ప్రజలకు అమలు చేయాలని ఆయన డిమాండ్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టర్ ని కలిసి విన్నవిస్తామని వారు తెలిపారు అధికారులు తప్పుడు సర్వేలను చెయ్యొద్దని కులంతో మతంతో సమందం లేకుండా అందరికి గృహలక్మి పథకం అందేలా సూడాలని డిమాండ్ చేశారు లేదంటే సిపిఐఎంల్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తాం అని అయన అన్నారు