రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 7 మార్చి 2025
గుడ్ మార్నింగ్ మణికొండ మార్నింగ్ వాక్* శుక్రవారం రోజున భారత రాష్ట్ర సమితి మణికొండ పార్టీ నాయకులు సాయి గౌతమ్ నగర్, పుప్పాలగూడ ప్రాంతoలో తిరిగి స్థానిక సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ గావించిన దరిమిలా ముష్కిం చెరువు చుట్టూతా పెద్ద పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారని అట్టి వాటి డ్రైనేజీ మొత్తంగా చెరువులో కలుపు తున్నారని, చెరువు స్థలం ఇప్పటికే కొంత మేర అన్యాక్రాంత మైనదని అందువలన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి డ్రోన్ సర్వే చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ తో పాటు బఫర్ జోన్ లను కాపాడుతూ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయ వలసిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు చెబుతున్నారు, మొత్తంగా చెత్తా చెదారంతో నిండి ఉన్న కారణంగా దోమల బెడదతో ప్రజలందరూ అనారోగ్యం పాలవుతున్నారని అందుకు గాను దోమల పెరుగుదల నివారణకు వెంటనే డ్రోన్ ద్వారా మందు కొట్టాలని అభిప్రాయం తెలియ చేసారు, ముష్కిం చెరువు పరిసర ప్రాంతాలలో లెక్కకు మించి బోరింగ్ లు వేసి భూగర్భ జలాలు అడుగంటి పోయే విధముగా నీటిని తోడి రాత్రి పగలు నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్మకాలు చేపట్టడం జరుగుతున్నదని, ముష్కిం చెరువు ప్రక్కన ఉన్న కాలి స్థలంలో రాత్రి కాగానే కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని లో గొంతుతో చెప్పడం జరిగినది, ప్రస్తుత కాలంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక విద్యార్థులు పరీక్షలకు సక్రమముగా చదవలేక పోతున్నారని వాపోయారు. తదుపరి బీ.ఆర్.సి నుండి మై హోమ్ అవతార్ వరకు మొదలెట్టి అసంపూర్తిగా ఉన్న రదారిని వెంటనే పూర్తి చేయాలని స్థానికులు వివరించినారు. నీటి ట్యాంకర్ల రవాణా చప్పుళ్లతో, కరెంట్ లేమితో, అసాంఘిక కార్యకలాపాల చప్పుళ్లతో రాత్రుల్లు నిద్ర కూడా సరిగా పోవడం లేదని భయ బ్రాంతులతో పుట గడుపు తున్నామని తమ ఆవేదనను తెలియ పరచినారు. కావున చెరువు ఆక్రమణకు గురికాకుండా, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై, అక్రమ నీటి సరఫరా దారులపై సంబంధిత అధికారులు స్పందించి తగిన నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, ఉపేందర్నాధ్ రెడ్డి, గోరికంటి విఠల్, సంఘం శ్రీకాంత్, బండమీది మల్లేష్, మాల్యాద్రి నాయుడు, షేక్ ఆరీఫ్, దిలీప్, కందట ప్రవీణ్, సుమనళిని, భాను చందర్, మహేందర్, బొడ్డు శ్రీధర్, రమణ మూర్తి, తిరుపతి, రాజేంద్ర ప్రసాద్, యాలల కిరణ్ తది తరులు తెలియ పరచడం జరిగినది.