మంతూర్ లో శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహం ప్రతిష్టాపన వేడుకలు

 

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 7. ( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా: అందోల్ నియోజకవర్గ పరిధిలో గల పుల్కల్ మండలం మంతూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన, శ్రీ మల్లికార్జున స్వామిదేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన, మహోత్సవం నిన్న గురువారం ఘనంగా నిర్వహించారు, అనంతరం దేవత పూజ, ప్రతిష్టాంగ హోమాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలమధ్య శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహం, ధ్వజస్తంభం ప్రతిష్టాపన, కార్యక్రమాలు కనుల పండుగల జరిగింది, ఈ సందర్భంగా, యంత్ర, విగ్రహ, ధ్వజశిఖర ప్రతిష్టాపన, దృక్బలి, పూర్ణాహుతి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదా వితరణ, కార్యక్రమాలు చేపట్టారు, ఈనెల 4వ, తేదీ నుండి ప్రారంభమైన కార్యక్రమాలు 7,వ తేదీ, గంగకు పోవుట,8,న బోనాలు,, 9,న మల్లన్న,భ్రమరాంబ,కేతకి, కళ్యాణం,10,న నాగవెల్లి వేషాలు, ఉన్నిగోలు సల్లలు చేయుట,11, న కడపలు కడుగుట, వంటి కార్యక్రమాలు జరగనున్నాయి, ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మండల కురుమ సంఘం మండల అధ్యక్షులు, పడమటి రమేష్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని, మొక్కలు చెల్లించుకున్నారు, ఈ కార్యక్రమంలో ఇందూర్ మహారాజ్,చిన్న మల్లికార్జున స్వామి, మల్లికార్జున దేవస్థానం చైర్మన్ సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి మహిపాల్, ఉపాధ్యక్షులు నర్సింలు, కోశాధికారి మల్కయ్య, గ్రామ మరియు పుల్కల్ మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking