పండితాపురంలో నేటి నుండి జాతరకు ముస్తాబైన శివాలయం

 

కార్యక్రమం లో మేకల మల్లిబాబు యాదవ్ ధనియాకుల హను మంతరావు

 

ఇల్లందు ప్రతినిధి మార్చి 7(ప్రజాబలం) ఇల్లందు నియోజకవర్గం శుక్రవారం నుండి 11 వ తారీకు వరకు కామేపల్లి మండలం, పండితాపురం గ్రామంలో జరిగే శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా జాతర కార్యక్రమం నాలుగు రోజులపాటు ఘనంగా జరుగుతుందని గ్రామ పెద్దలు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, ధనియాకుల హనుమంతరావు తెలిపారు. శివాలయం ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో రాజకీయాలు వర్గాలకు అతీతంగా పెద్దలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయంగా అభివర్ణించారు. ప్రతి ఏటా మహాశివరాత్రి తర్వాత తొమ్మిది రోజులకు పండితాపురం గ్రామంలో అనాది నుండి శివాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణo నిర్వహించబడుతుందని, ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడలి తీర్థాల జాతర తర్వాత అతిపెద్ద జాతర గ్రామంలో జరుగుతుందని, ఈ జాతరలో దాదాపు నాలుగైదు జిల్లాల నుండి దాదాపు 50 వేల మంది భక్తులు పాల్గొంటారని, సాంస్కృతిక కార్యక్రమాలతో , ఊరేగింపు కార్యక్రమాలతో జాతర ఘనంగా నిర్వహించబడుతుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోఆలయ పూజారి సుగంధం రామలిoగేశ్వరశర్మ,, బానోతు నరసింహ నాయక్, మేకపోతుల మహేష్ అంబటిపూడి వెంకటయ్య, మేకల మల్లికార్జునరావు, కొమ్మిని శ్రీనివాసరావు భూక్య నాగేంద్రబాబు, పాటిబండ్ల ప్రసాదు, దొడ్డ వేణు, జన్నారపు లింగయ్య, పసుమర్తి సత్యం, అంబడిపూడి శ్రీనివాసరావు, బత్తుల ఉపేందర్ శీలం పుల్లయ్య, జక్కంపూడి వెంకటేశ్వర్లు, గాడి పల్లి సైదులు దొడ్ల మల్లేష్ దండగల దేవేంద్ర అయితన బోయిన సత్యం భానోత్ భీముడు, బత్తుల వీరబాబు, బత్తుల నాగరాజు చల్ల మల్లయ్య మొగిలి శ్రీను, బోడ శ్రీను, శబరి నాథ్, దొడ్ల నాగేశ్వరరావు, జలగం శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking