బోరు నీరు అక్రమ అమ్మకాలతో భూగర్భ జలాల కొరత.

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 6 మార్చి 2025
భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ నాయకులు గుడ్ మార్నింగ్ మణికొండ మార్నింగ్ వాక్ గురువారం రోజున పుప్పాలగూడ పరిధిలోని సాయి గౌతమ్ నగర్ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో తిరిగి ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణలో సేకరించిన వివరాలు చెత్తా చెదారంతో నిండి ఉన్న ముష్కిం చెరువుకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం కారణంగా దోమల బెడద తీవ్రతతో పిల్లలు పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారని, కొంత మంది స్వార్థపరులు లోతుగా బోరింగ్ లు వేసి నీటిని తోడి ట్యాంకర్లకు ట్యాంకర్లు అమ్మకాలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం కలదని, అనుమతులు లేకుండా నీటిని అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని, ఛీటికి మాటికి విద్యుత్ శక్తి పోవడం మూలాన విద్యార్థులు, వయో వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వీధి కుక్కలతో పిల్లలు, పెద్దలు భయబ్రాంతులకు గురౌతున్నారని వాటిని షెల్టర్ హోమ్ కు తరలించాలని, అలనాటి పెర ఉన్న హోటర్ వారి బ్లోయర్ల ద్వారా వేడి వేడి ఆవిరి బయటకు వదలడం వలన స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కావున తది తర విషయాలపై సంబంధిత అధికారులు స్పందించి తగిన నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, సంగం శ్రీకాంత్, ఉపెందర్నాద్ రెడ్డి, యాలాల కిరణ్, భానుచందర్, కందాట ప్రవీణ్, బోడ్డు శ్రీధర్, సుమనళిని, తిరుపతి తది తరులు, తత్స్వర ప్రజల మద్దతుతో సహచర నాయకుల సహకారాలతో ఇట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గులాభిదళ సైనికులుగా రాబోయే సమయంలో తీవ్ర తరం చేస్తామని, మున్ముందు రాబోయే ఏ ఎన్నికల నయినా వీరోచితంగా ఎదుర్కొని పార్టీ జండా రెపరెప లాడించ డానికి సంసిద్ధంగా ఉన్నామనీ తెలియపరచడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking