జిల్లాలో మొత్తం 115 పరీక్షా కేంద్రాలు
మేడ్చెల్ మల్కాజిగిరి జల్లా కలెక్టరు గౌతం పొట్రు
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నవంబర్ 7:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్-III పరీక్ష ఈ నెల 17, 18 తేదీలలో నిర్వహిస్తున్న పరీక్షలకు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 115 పరీక్షా కేంద్రాలలో 65,361 మంది అభ్యర్థులుఈ పరీక్షలకు హాజరు కానున్నారని మేడ్చెల్ మల్కాజిగిరి జల్లా కలెక్టరు గౌతం పొట్రు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పరీక్షలు రెండు సెషన్‌లు ఉంటాయని పేపర్-1- 10:00 AM నుండి 12:30 PM వరకు మరియు పేపర్-2- 3:00 PM నుండి 05:30 PM వరకు మరియు 18/11/2024 పేపర్ 3-10:00 AM నుండి 12:30 PM వరకు నిర్వహించడం జరుగుతుందని అభ్యర్థులు 10/11/2024 నుండి కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in నుండి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కలెక్టరు సూచించారు.
పరీక్ష రోజు ఉదయం 08:30 గంటల నుండి ముందస్తు సెషన్‌కు మరియు మధ్యాహ్నం 1:30 గంటల నుండి మధ్యాహ్న సెషన్‌కు అభ్యర్థులు పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబడతారు. పరీక్షా కేంద్రం గేట్ ఉదయం 09:30 గంటలకు మరియు మధ్యాహ్నం సెషన్ కోసం మధ్యాహ్నం 2:30 గంటలకు మూసివేయబడుతుందని, గేట్లు మూసివేసిన తర్వాత అభ్యర్థులెవరూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరు.
పరీక్షలకు మొదటి సెషన్‌కు ఉపయోగించిన హాల్ టికెట్ కాపీని మిగిలిన సెషన్‌లకు ఉపయోగించాలని సూచించారు.
తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ మరియు అన్ని సెషన్‌ల ప్రశ్నా పత్రాలను భద్రపరచుకోవాలని సూచించారు.
ఏదైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే అభ్యర్థులు TGPSC టెక్నికల్ హెల్ప్ డెస్క్‌ని ఫోన్ నంబర్లు 040-23542185 లేదా 040-23542187లో సంప్రదించవచ్చు లేదా helpdesk@tspsc.gov.inకు ఇమెయిల్ చేయవచ్చు. హెల్ప్ డెస్క్ కాల్ టైమింగ్స్: 10:30 A.M. నుండి 1:00P.M. & 1:30 P.M. నుండి 5:00 P.M. అన్ని పని దినాలలో సంప్రదించవచ్చని కలెక్టరు తెలిపారు.