క్వింటాల్ కు 7,521/- రూపాయల మద్దతు ధర
కొనుగోలు కేంద్రాలను స్వాధినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్
ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ నవంబర్ 07 : మంచిర్యాల జిల్లాలోని తాండూర్ మండలం రేపల్లెవాడ లోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా నిర్వహించే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి ప్రారంభించారు.
అనంతరం ఇద్దరు యువ పత్తి రైతులు ప్రసాద్,రాము లను ఎమ్మెల్యే వినోద్ శాలువాతో సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ… రైతులు కొనుగోలు కేంద్రానికి తేమ తక్కువగా ఉండి,చెత్తా చెదారం లేని నాణ్యత గల పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు.రైతులు దళారులకు పత్తిని విక్రయించి మోసపోవద్దని తెలిపారు.పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు అలాగే ఏ కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు .
అటు వడ్లు ఇటు పత్తి కొనుగోల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన తమను నేరుగా సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి షాబుద్దిన్,సంబంధిత అధికారులు,జిన్నింగ్ మిల్లు యాజమాన్యం, సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.