14 నెలలుగా వేతనాలు చెల్లించని ఐటిడిఏ ఇంజనీరింగ్ అధికారులు

న్యాయం చేయాలని ఉన్నత అధికారులకు ఎలక్ట్రిషియన్ వేడుకలు

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ నవంబర్ 07 : ఐటిడిఏ దండేపల్లి డివిజన్ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యుత్ మరమ్మతులతో పాటుగా విద్యుత్ తదితర సేవలు ఎలక్ట్రిషియన్ గా విధులు నిర్వహించినప్పటికి ప్రభుత్వం నుంచి నాకు వేతనాలు రావడం లేదని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన దుర్గం. లింగేశ్వర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గా ఆర్.వి కర్ణన్ విధులు నిర్వర్తించినప్పుడు మొదటగా మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి ఐటిడిఎ డివిజన్ లో ఎలక్ట్రిసియన్ గా నన్ను నియమించడం జరిగినదని నేను చాలా కాలం విధులు నిర్వర్తించిన్నప్పటి వేతనాలు రాలేక కొంతకాలం పని మానివేయడం జరిగిందని అనంతరం దండేపల్లి డివిజన్ లో ఎలక్ట్రిషియన్ స్థానం ఖాళీ ఉందని తెలియడం తో ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కి ఎలక్ట్రిషియన్ గా విధుల్లో కి తీసుకోమని దరఖాస్తు చేసుకోగా ప్రాజెక్టు అధికారి మళ్ళీ దండేపల్లి డివిజన్ లో ఎలక్ట్రిషియన్ గా విధులు నిర్వర్తించమని గత సంవత్సరం జులై నెలలో ఆదేశాలు జారీ చేయగా నేను దండేపల్లి డివిజన్ లో ఎలక్ట్రిషియన్ గా విధుల్లో చేరి 14 నెలలుగా నాకు ఈ డివిజన్ ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించిన విధులు సక్రమంగా నిర్వర్తించినప్పటికి వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వేతనాలు సక్రమంగా రాకపోవడం మూలంగా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నానని ఈ విషయం పై సంబంధిత జిల్లా ఉన్నత అధికారులు నిజ నిజాలు పరిశీలిస్తూ చొరవ తీసుకుని దీనిపై విచారణ జరిపించి నాకు సకాలంలో వేతనాలు వచ్చేలా చేయగలరని కోరారు.జీతం ఇవ్వాలని డి ఈ ఈ ని సంప్రదించగా అసభ్య పదజాలంతో దూషించటం జరిగింది అని వాపోయారు.దళితుడనని చులకనభావంతో మాట్లాడినటువంటి డి ఈ ఈ పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking