మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో నేడు దుబాయ్ నుండి సొంత ప్రాంతం హుస్నాబాద్ చేరుకోనున్న గల్ఫ్ బాధితుడు చొప్పరి లింగయ్య…
ఫ్లైట్ టికెట్ కు డబ్బులు చెల్లించి గల్ఫ్ బాధితుడు చొప్పరి లింగయ్య ను హైదరాబాద్ తీసుకొచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్
గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తనని ఇండియా తీసుకోవాలని హుస్నాబాద్ పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ,మంత్రి పొన్నం ప్రభాకర్ ని సెల్ఫీ విడియో ద్వారా విజ్ఞప్తి చేశారు..
వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పరి లింగయ్య కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ బి ఏం వినోద్ కుమార్ ,వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి లను సమన్వయం చేశారు..
మంత్రి పొన్నం ప్రభాకర్ పంపించిన పలువురు ఎన్నారై ప్రతినిధులు అనారోగ్యంతో ఉన్న చొప్పరి లింగయ్య వద్దకు వెళ్లిన పరామర్శించి దైర్యం చెప్పారు..
అనారాగ్యంతో ఇబ్బందులు పడుతున్న తనకి బాగోగులు చూసుకోవడానికి పంపించి ,ఫ్లైట్ టికెట్ డబ్బులు చెల్లించి స్వగ్రామానికి తీసుకొచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి ధన్యవాదాలు తెలిపిన చొప్పరి లింగయ్య,ఆయన కుటుంబ సభ్యులు..