ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 03 : గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక లక్షెట్టిపేటలోని ఇటిక్యాల గ్రామంలో శ్రీ ప్రసన్న లక్ష్మీనరసింహస్వామి ప్రాంగణంలో గల శ్రీ శ్రీ శ్రీ నిత్యానంద గొల్లపల్లి రామలింగయ్య చారి స్వామీజీ విగ్రహానికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది,తీర్థ ప్రసాద వితరణ భజన కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గొల్లపల్లి శ్రీధర్ ఆచార్యులు రామానంద స్వామి ఆచార్యులు మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు పాల్గొనడం జరిగింది