ఖమ్మం ప్రతినిధి జులై 03 (ప్రజాబలం) ఖమ్మం గురు పౌర్ణమి సందర్బంగా 45వ డివిజన్ మామిళ్ళగూడెం సాయి బాబా గుడిలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజకార్యక్రమంలో ఖమ్మం ట్రాఫిక్ సీఐ అంజలి పాల్గొని సాయిబాబా ను దర్శించుకున్నారు. అనంతరం 45వ డివిజన్ కార్పొరేటర్ బుడిగం శ్రీనివాసరావు ట్రాఫిక్ సీఐ గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో సాయి బాబా గుడి చైర్మన్ ఊటుకూరి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ జక్కుల లక్ష్మయ్య, దేవాలయం అయ్యగారు భరద్వాజ్, జక్కుల వెంకటరమణ, గుమ్మడివెల్లి శ్రీనివాస్,వల్లూరి విజయ్, షేక్ ఇక్బాల్, సాయిబాబా సేవకులు వనం రవి, తదితరులు పాల్గొన్నారు.