రఘునాథఫాలెంలో స్వామి నారాయణ ట్రస్టు ఆధ్వర్యంలో గురుకుల విద్యాలయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు01 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా రఘునాథఫాలెం మండలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్వామి నారాయణ ట్రస్టు ఆధ్వర్యంలో గురుకుల విద్యాలయం కొలువుదీరనుండటంతో విద్యార్థులకు విలువలతో కూడినవిద్య అందుబాటులోకి రానుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రఘునాథపాలెం మండలంలో 13.07 ఎకరాల విస్తీర్ణంలో కేజీ నుంచి 12 వ తరగతి వరకు గురుకుల విద్యాలయం నెలకొల్పడానికి మార్కెట్ ధరకు భూమిని కేటాయించినందుకు గానూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల గురువారం కృతజ్ఞతలు తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ విద్యాసంస్థల కన్నా తక్కువ ఫీజులతోనే సీబీఎస్ ఈ సిలబస్ తో విద్యాలయం కొలువుదీర బోతోందన్నారు. స్వామి నారాయణ గురుకుల ట్రస్ట్ భారతీయ సంస్కృతి ప్రతిభింబించే విధంగా ఉంటుందన్నారు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలతోపాటు పక్కనే ఉన్న జిల్లాల్లోని 500 మంది విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందుతుందని అభిప్రాయపడ్డారు. స్వామినారాయణ్ గురుకుల ట్రస్ట్ గత 77 సంవత్సరాల పైగా సామజిక సేవలో నిమగ్నమై ఉందన్నారు.దేశ వ్యాప్తంగా 58 గురుకుల విద్యాసంస్థలను స్థాపించడంతోపాటు అమెరికా, బ్రిటన్,కెనడా, ఆస్ట్రేలియా దేశాలలో గురుకులాలను ఏర్పాటు చేసి అత్యున్నత ప్రమాణాలతో ఇంటర్నేషనల్ విద్యా సంస్థల కన్నా తక్కువ ఫీజులతోనే చక్కని వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిందన్నారు. డేస్కాలర్ విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారని మంత్రి కొనియాడారు. జాతీయ స్థాయి విద్యా రంగంలో పలు అవార్డులను అందుకున్న ఈ గురుకుల సంస్థ ఖమ్మం జిల్లాకు రానుండటం భావి విద్యార్థులకు వరమన్నారు. గురుకుల విద్యాలయం ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking