ఖమ్మం ప్రతినిధి ఆగస్టు01 (ప్రజాబలం) ఖమ్మం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్ మాతృమూర్తి మాదినేని భారతమ్మ (80 సం.లు) ఈ రోజు ఖమ్మంలో మరణించారు. సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు లు ఆమె మృతదేహాన్ని గురువారం సందర్శించి నివాళులర్పించారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ తల్లి మాదినేని భారతమ్మ అకాల మరణం పట్ల సిపియం జిల్లా కమిటీ సంతాపం కుటుంబానికి సానుభూతి తెలియ జేసినట్లు పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలియజేశారుభారతమ్మ వామపక్ష కుటుంబాల నుండి వచ్చారని, అభ్యుదయ భావాలు కలిగిన ఆమె, పిల్లలను కూడా వామపక్ష భావాలవైపు నడిపించారని, వారి పెద్ద కుమారుడు రమేష్ ప్రస్తుతం పార్టీ జిల్లా కమిటి సభ్యుడుగా, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తున్నారని తెలిపారు నివాళులర్పించిన వారిలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు యర్రా శ్రీకాంత్, ఎం.సుబ్బారావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, వై.విక్రం, కళ్యాణం వెంకటే శ్వరరావు సిహెచ్.కోటేశ్వరరావు బొంతు రాంబాబు, జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీనివాసరావు ఆర్.ప్రకాష్, ఎస్.కె.బషీరుద్దీన్, కుటుంబరావు, వర్మ, ఎస్.కె.వి.ఎ.మీరా సత్తెనపల్లి శ్రీను, ప్రతాపనేని వెంకటేశ్వరరావు పి.సంగయ్య తదితర నాయకులు నివాళులర్పించారు.