విజ్ఞాన విహారయాత్రలో గురుకుల విద్యార్థినులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 13 : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక,పీఎం శ్రీ స్కీం కింద ఎంపికైన పాఠశాలల విద్యార్థులను, విజ్ఞాన సాంకేతిక విహారయాత్ర తీసుకువెళ్లే అవకాశాన్ని,విద్యార్థులకు సాంకేతిక అంశాలపై అవగాహన కలిగించే పథకాన్ని వినియోగించుకొని, స్థానిక లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ విద్యార్థినులను, రెండు విడతలుగా సైన్స్ ఎక్స్పోజర్ ట్రిప్పులకు తీసుకువెళ్లినట్టు కళాశాల ప్రిన్సిపల్ ఎం.లలిత కుమారి తెలియజేశారు.విజ్ఞాన సాంకేతిక విహార యాత్రలో భాగంగా,”మొదటి విడతగా:” తేదీ: 11 ఏప్రిల్,2024 నాడు,8వ 9వ తరగతి విద్యార్థినులను, హైదరాబాదులోని: బిర్లా ప్లానెటోరియం,బిర్లా సైన్స్ మ్యూజియం,బిర్లా మందిర్, జంతు ప్రదర్శనశాల, సచివాలయ భవనాలను, అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని మరియు ట్యాంక్ బండ్ మీద ఉన్న మహనీయుల విగ్రహాలను సందర్శింపజేయడం జరిగిందనీ,”రెండవ విడతలో”: తేదీ:13 ఏప్రిల్,2024 నాడు వరంగల్ – హనుమ కొండ లోని రీజినల్ సైన్స్ సెంటర్,భద్రకాళి దేవాలయము,పద్మాక్షి దేవాలయం,జంతు ప్రదర్శనశాల,వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి మరియు రామప్ప దేవాలయాన్ని సందర్శింప చేయడం జరిగిందనీ,ప్రిన్సిపల్ తెలియజేశారు.కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పీ ఎం శ్రీ స్కీం కింద తమ పాఠశాల ఎంపిక కావడం వల్లనే,ఇట్టి విజ్ఞాన సాంకేతిక విహారయాత్రలకు తమ విద్యార్థులను తీసుకువెళ్లే అవకాశం కలిగిందని, ప్రిన్సిపల్ తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking