పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ బారి మెజార్టీతో గెలిపిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 13 : మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో స్వర్గీయ మాజి స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు 25 వ వర్ధంతి సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.పెద్దపల్లి పార్లమెంట్ మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో రాష్ట్ర ఐటీ మంత్రి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమ్మేళనంలో పాల్గొని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ని భారీ మెజారిటీతో గెలుపించాలని కోరిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి,బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ సీనియర్ నాయకుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
