గాంధీ కి గుత్తా సుఖేందర్ నివాళులు

 

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సోమవారం తెలంగాణ శాసన సభ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , శాసన మండలి విప్ ఎమ్. ఎస్ ప్రభాకర్ రావు ,ఎమ్మెల్సీ బోగరపు దయానంద్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు ,
బిఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు మాహాత్మా గాంధీ అని తెలిపారు. సత్యం,అహింస మార్గంలో దేశాన్ని నడిపించి స్వాతంత్య్రన్ని సాధించిన గొప్ప నేత అని పేర్కొన్నారు. మహాత్ముడు చూపిన దారిలో నడుస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.మహాత్మా గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ నేటి యువత తమ లక్ష్యాన్ని సాధించుకోవాలని ఆయన సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking