రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 02 అక్టోబర్ 2023: మన మన పరి సరాల పరిశుభ్రతతో శుచి శుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం చేపట్టడం అవుతుందని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హి సేవా ర్యాలీలో రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు టీ.ప్రకాష్ గౌడ్ పాల్గొంటూ ప్రజలను సంబోధిస్తూ అందరూ విధిగా చైతన్యంతో అపరి శుభ్రతపై రాజీలేని పోరాటం చేయాలని, స్వచ్ఛత ఉద్యమంలో భాగం పంచు కోవాలని కోరారు. ప్రతి కాలనీ, వీధి, పట్టణం అంతటా స్వచ్ఛతను పాటించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ రాజేంద్ర నగర్ నిర్మాణంలో మనం అందరం పెద్ద పాత్ర పోషించాలని రాజేంద్ర నగర్ ప్రజానికానికి పిలుపునిస్తు, మనమంతా కలిసి బాపుజీ కలలను సాకారం చేద్దామని తెలియ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ డీ.సీ. రవికిరణ్, డివిజన్ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.