హైదరాబాద్ జూన్ 21 ;వివిధ పద్ధతుల్లో హ్యాకర్లు సైబర్ దాడుల ముప్పు గురించి మరియు ఈ ఉచ్చులో పడి సామాన్యులు ఎలా బాధపడుతున్నారనే దాని గురించి అవగాహన కల్పించే అలర్ట్ (హ్యాక్ గురికావద్దు) షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ను రాజ్య సభ సభ్యులు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్ లో ఆవిష్కరించారు.ఈ షార్ట్ ఫిల్మ్ కు నరేష్ కుమా మడికి దర్శకత్వం వహించారు. ప్రజలు వారు వాడే కంపూటర్ ,మొబైల్, షోషల్ మీడియా లలో గోప్యత గురించి మరియు వారి డేటాను ఎలా సంరక్షించుకుంటారు అనే దాని గురించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం అనే అంశాన్ని ఇందులో విశదీకరించారు.అలర్ట్ షార్ట్ ఫిల్మ్ కాలేజ్ స్టూడెంట్, ప్రైవేట్ స్కూల్ టీచర్ మరియు రిటైర్డ్ ఓల్డ్ మ్యాన్ అందరి జీవితాన్ని ఈ హ్యాకర్ల వలలో తెలియకుండా బంధిస్తుంది. ఈ వ్యక్తులు ఎలా కష్టపడి ఈ సమస్య నుంచి బయటపడ్డారు అనేది కథలో భాగం.అనేక కేసులు నమోదు కాకపోవడంతో ప్రజలు మౌనంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ కోరుతోంది. ఈ సైబర్ దాడుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం మరియు అప్రమత్తంగా ఉండేలా చేయడం ఈ షార్ట్ ఫిల్మ్ లక్ష్యం.ఈ కార్యక్రమం లో గుజ్జ కృష్ణ ,బీసీ సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర కన్వీనర్ పితాని ప్రసాద్, అంజి, డైరెక్టర్ నరేష్ కుమార్ మడికి తదితరులు పాల్హ్గోన్నారు. ఈ లఘు చిత్రంలో ఉమా, గణేష్, సాయి, కూర్మారావు, అప్పలనారాయణ, నాగమల్లయ్య, డాక్టర్ ఎస్ఎన్ బల్లా నటిస్తున్నారు.