పాఠశాల విద్యార్థులకు బూట్లు వగైరా వితరణ

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల శుభ సందర్భంగా 21.06.2023 బుదవారం రోజున మణికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మణికొండ మునిసిపాలిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సంగ సేవకులు రాఘవ రెడ్డి, బిక్షపతి, హన్స్రాజ్ యాదవ్, శంకర్ సింగ్, చారీ లు పాల్గొనగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ సతీశ్ ఆధ్వర్యంలో భారత్ వికాస్ పరిషత్ యోగా బృందం సభ్యులు అంజనా, డాక్టర్ సిందుజ మరియు మల్లా రెడ్డిలు కలసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరంజన్ సహయ సహకారాలతో విద్యార్తిని విద్యార్థులందరిచే యోగాభ్యాసం చేయించినారు తదుపరి వీ ఆర్ ఫర్ యు సభ్యుడు ప్రముఖ ఈ.ఎన్.టీ డాక్టర్ జీ.వీ.ఎస్ రావు బడి పిల్లలకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండేలా వారికి సరిపోయే బూట్లు, సోక్స్లు మరియు జామెట్రీ బాక్స్ లు వితరణ చేసిన తరువాత ప్రత్యక్ష దైవాలయిన తల్లీ తండ్రి లను పూజిస్తూ వారీ చెప్పిన మాటలను ఆచరణలో పెడితే జన్మ సార్ధకం అవుతుందని తరువాత గురువులకు తగిన గౌరవ మర్యాదలతో ప్రణమిల్లి అనుసరించి మంచి విద్యార్థులుగా పెరుగాంచలని ఆశీర్వదించారు ఈ కార్య క్రమంలో వీ.ఆర్.ఫర్.యు వయోజన సంస్థ కార్యదర్శి డీ.ఎస్.ఆర్ దాస్, కోశాధికారి దిలీప్ కక్కడ్, సభ్యులు అందె లక్ష్మణ్ రావు, శివరామకృష్ణా, నాగేంద్ర రావు, డాక్టర్ ప్రభావతీ, విద్యాభిమానులు, టీచర్లు, విద్యార్థుల తల్లి దండ్రులు అందరూ పాల్గొని జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking