తాజా మాజీ ఎమ్మెల్యేలా ఊకేదంపుడు మాటలే తప్ప అందోల్ కు చేసిందేమ్ లేదు

….డా.ముప్పారంప్రకాశం
బిఎస్పీ పార్టీ అందోల్ నియోజకవర్గం ఇంచార్జి

సంగారెడ్డి జూన్ 21 ప్రజ బలం ప్రతినిది:
అందోల్ తజా, మాజీ ఎమ్మెల్యేల ఊకేదంపుడు మాటలే తప్ప అందోల్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, వారు ఇరువురు వారి కార్యకర్తలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి పరిమితమై అందోల్ అభివృద్ధిని గాలికి వదిలేసి, అందోల్ ప్రజల బతుకులు అగాధం పాలవౌతుంటే పట్టింపులు లేకుండా పబ్బం జరుపుకుంటున్నారని బహుజన్ సమాజ్ పార్టీ అందోల్ నియోజకవర్గం ఇంచార్జ్ డా.ముప్పారం ప్రకాశం అన్నారు.
ఆ పార్టీ అందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణంలోని ఓ హోటల్లో జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్నా డా.ముప్పారంప్రకాశం మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గానికి ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రంలో ఒరిగిందేమీ లేదని, ఈ నియోజకవర్గం నుంచి రిజర్వేషన్ ఉండబట్టే దళితులను శాసనసభకు పంపుతుండ్రు తప్ప, ఈ కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ లకు బహుజన సమాజంపై చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో బీసీ లకు 70 సీట్లు కేటాయించింది కేవలం బి.ఎస్.పి.మాత్రమే అన్నారు.
అందోల్ నియోజకవర్గం నుంచి ప్రజా ఉద్యమాలలో ఉన్న వారినే రాబోయే ఎన్నికల్లో బిఎస్పి పోటీకి పెడుతుందని, వచ్చే ఎన్నికల్లో అందోల్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజనులకు సంపన్న బానిసలకు మధ్య పోటీ ఉంటుందని చెప్పారు.
అగ్నాత వీరులుగా ఉండి బహుజనోధ్యమాలు నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ఏకమై రాజ్యాధికారం కోసం బి.ఎస్.పి తో కలిసి రాజకీయ పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు.

అసెంబ్లీ నియోజకవర్గ బి.ఎఎస్.పి. నూతన కమిటీ ఎన్నిక
ఈ సమావేశంలో అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా యం.డి.చాంద్ పాషా, నియోజకవర్గ అధ్యక్షులుగా పల్లె కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులుగా కాంతారావు, ప్రధానకార్యదర్శి గా పాపయ్య, కోశాధికారిగా రవి, మహిళలా కన్వీనర్ గా శ్రీమతి మమతా, కో కన్వీనర్ గా శ్రీమతి సుప్రియ, ఈసీ సభ్యులుగా ముప్పారం పద్మారావు, శేఖర్, పల్లె కిరణ్ కుమార్, లతో పాటు 20 మందితో కూడిన నూతన నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల కమిటీలను రద్దు చేసి, తాత్కాలిక అధ్యక్షులను నియమించినారు.
ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking