నీ సర్వీస్సే నన్ను మీ ఇంటికి రప్పించింది

 

విశ్రాంత ఐఎఎస్ అధికారి డాక్టర్ ఎంవి రెడ్డి

ఖమ్మం ప్రతినిధి జూన్ 20 (ప్రజాబలం) ఖమ్మం నీ సర్వీస్సే నన్ను మీ ఇంటికి రప్పించిందని విశ్రాంత ఐఎఎస్ అధికారి, కొత్తగూడెం మాజీ కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి అన్నారు. కొత్తగూడెంలో డిపిఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న శీలం శ్రీనివాసరావు మాతృమూర్తి శీలం సరస్వతి ఈ నెల 14న ఆకస్మికంగా మృతి చెందిన సంగతి విధితమే. అప్పుడే సమాచారం తెలుసుకున్న మాజీ కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడి శ్రీనివాస్ కు ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. మంగళవారం కల్లూరులోని అంబేద్కర్ నగర్ కు డాక్టర్ ఎంవి రెడ్డి దంపతులు విచ్చేసి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి బాధలో ఉన్నవారిని ఓదార్చారు. డాక్టర్ ఎంవి రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన ఆ రోజుల్లో శీలం శ్రీనివాస్ కొత్తగూడెం డిపిఆర్ఓగా పని చేస్తున్నారు. తదుపరి డాక్టర్ ఎంవి రెడ్డి మే 31, 2021న పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ.. నీ యొక్క సర్వీసెస్ నన్ను మీ ఇంటికి నడిపించాయని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ తల్లి సరస్వతి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking