హెయిల్ టాటా మని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్

హైదరాబాద్ సెప్టెంబర్ 21 ();హైదరాబాద్ పట్టణంలో బేగంపేట్ వరుణ్ టవర్స్ లో గల వరుణ్ మోటార్స్ లో 400 మందికి పైగా ఉద్యోగస్తుల కొరకు ఉచిత మెడికల్ క్యాంప్ను నిర్వహించారు.ఈ క్యాంపు లో దంతా పరీక్ష, కంటి పరీక్ష , షుగర్ పరీక్ష ,బిపి పరీక్ష, గైనిక్ పరీక్షలు మరియు ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు మరియు శానిటేషన్ ప్యాడ్స్ పంపిణీ చేయడము జరిగింది. అలాగే ఉచిత బ్లడ్ డొనేషన్ నిర్వహించగా 58 యూనిట్స్ రక్తం సేకరణ జరిగింది.ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ జనరల్ ఫిజిషన్స్, క్లోవ్ డెంటల్ డాక్టర్స్, గైనిక్ డాక్టర్ వెల్నెస్ హాస్పిటల్, భాంజి కేరజ్ బ్లడ్ బ్యాంక్ మరియు హెయిల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు మరియు ఛైర్పర్సన్ కాకుమాను లూర్ధు జ్యోతి మరియు ట్రస్ట్ సభ్యులు డి శ్రీనివాస్ రెడ్డి, పి ఉషారాణి, కే ప్రవీణ్ కుమార్, జి రాజు, టి శేషు, ఎం శ్రీలక్ష్మి, పి సునీత రెడ్డి, పి జగదీష్ కుమార్, డా. కొమ్ము ప్రవీణ్ కుమార్ మరియు ,లైన్స్ క్లబ్ జయ మోహన్ , కృష్ణారెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్బంగా హెయిల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు మరియు ఛైర్పర్సన్ కాకుమాను లూర్ధు జ్యోతి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో స్వచ్చంద సంస్థలు ముదుకు రావాలని పిలుపునిచ్చారు.తమ సంస్థ ఆద్వర్యం లో పేదలకు ఉచితంగా బట్టల పంపిణి పిల్లలకు న్యూత్రిషణ్ ఫుడ్స్, స్కూల్ పిల్లలకు పుస్తకాలు,నోట బుక్స్, అందిస్తున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking