గౌరీ పుత్ర యూత్ గణనాధునికి ఘనమైన పూజలు.

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 21

వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా వరంగల్ నగరంలో జరుగుతున్నాయి. నగరంలోని సెకండ్ బ్యాంక్ కాలనీ లో గౌరీ పుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 అడుగుల మట్టి గణనాధుడు ఆకట్టుకుంటున్నాడు. నిటారుగా అభయ హస్తం తో దీవిస్తున్నట్లుగా కొలువైయున్న గణనాధునికి కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో మూడవరోజు ఘనంగా పూజలు చేసి రకరకాల పిండి వంటలు, ప్రసాదాలను తయారుచేసి సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా గౌరీపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా అధ్యక్షులు పల్లె రాజు తెలిపారు. కాలనీ వాసులు కోరిన కోరికలను గణనాథుడు తీరుస్తున్నాడని కాలనీలోని ప్రజలందరూ కలిసికట్టుగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, గౌరీపుత్ర యూత్ సభ్యులు ప్రదీప్, సిద్ధార్థ, భార్గవ్ ,కమల్, ప్రీతమ్ ,కిరణ్, బిట్టు, సందీప్, దిలీప్, సంజు విశ్వ, దీపక్, భరత్, తోట, అనిల్,యూత్, కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking