సైనికుల మద్య హేల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ రక్షా బందన్ వేడుకలు

 

హైదరాబాద్ ఆగష్టు 30 ();రక్షాబంధన్ పర్వదినం పురస్కరించుకొని హేల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కాకుమాను జ్యోతి ఆద్వర్యం లో ట్రస్ట్ సిఅర్పిఎఫ్ క్యాంపు, 99 బెటాలియన్ సభ్యులతో రక్షాబంధన్ జరుపుకున్నారు.ఈ సందర్బంగా దేశ రక్షణే ద్యేయంగా పనిచేస్తున్న సైనికులకు రాఖీ లు కట్టి సోదరాబావాన్ని చాటుకున్నారు.ఈ సందర్బంగా కాకుమాను జ్యోతి మాట్లాడుతూ తమ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా నిరంతరం నిఘాతో డేగ కన్నులతో చూసే సైనికులు నిజమైన దేశాభాక్తులని కొనియాడారు.వీరిమద్య రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమం లో , కె.ప్రవీణ్ కుమార్, పి.ఉషా రాణి, పి.జగదీష్ కుమార్, బి.శ్రీనివాస రెడ్డి, సిఆర్‌పిఎఫ్ క్యాంప్, 99 బెటాలియన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking