కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బేషరత్తుగా రెగ్యులరైజ్ చేస్తాం…!

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 30 (ప్రజాబలం) ఖమ్మం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని… రాగానే ఎటువంటి షరతులు లేకుండానే సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేస్తామని… పార్టీ పక్షాన ఇది తన హామీ అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గత పదిహేను రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలకు సంఘీభావం తెలుపుతూ ఖమ్మం సమీకృత కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్ లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ గత 15,16 ఏళ్లుగా కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 4500 మందిని రెగ్యులరైజ్ చేయాలని కోరితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు పెడతామని, ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఇలాంటి షరతులు విధిస్తుందని ఇది సమంజసం కాదని మండిపడ్డారు. ఏళ్లుగా పనిచేస్తున్న వారికి ఖచ్చితమైన అవగాహన ఉంటుందని బేషరత్తుగా వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి డిమాండ్లను బేషరత్తుగా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఏఎన్ఎం సోదరీమణులు పొంగులేటి శీనన్నకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో పొంగులేటితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking