తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డైనమిక్ లీడర్ లయన్ కోడిప్యాక నారాయణ గుప్త అర్ధ శత సంవత్సర జన్మదిన వేడుకలు

విద్యార్థుల మధ్య బర్త్ డే కేక్ కట్ చేసి నోట్ బుక్స్, స్లేట్ పలకలు పంపిణీ

తూప్రాన్, జులై, 14. డైనమిక్ లీడర్, 16వ వార్డ్ కౌన్సిలర్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, గీతా విద్యా సంస్థల డైరెక్టర్ లయన్ కోడిప్యాక నారాయణ గుప్త (50వ) అర్ధ శత సంవత్సర జన్మదిన వేడుకలు శుక్రవారం ఉదయం తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ ప్రయిమరి స్కూల్ విద్యార్థుల కరతాల ధ్వనులు, హ్యాపీ బర్త్ డే నారాయణ సెట్జ్ అంటూ కేరింతలు మధ్య బర్త్ డే కేక్ కట్ చేశారు. కోడిప్యాక నారాయణ గుప్త బర్త్ డే పురస్కరించుకుని విద్యార్థులకు నోట్ బుక్స్, స్లేట్ పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్ మాట్లాడుతూ తూప్రాన్ లయన్స్ క్లబ్, ఆర్య వైశ్య సంఘం తరపున లయన్ కోడిప్యాక నారాయణ గుప్త కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నారాయణ సెట్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలుమరెన్నో జరుపుకోవాలనిమనసారా కోరుకుంటున్నాను అని అన్నారు. కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,ని ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది, ఆలాంటీ నా ప్రియతమ నాయకుని ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ…. ఎప్పుడూ సంతోషంగాఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ… మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతోనిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ.. మరో సారిపుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ వంగ భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ లయన్ పుట్ట వెంకటేష్,ఐ. వి.ఎఫ్ మెదక్ జిల్లా యూత్ అధ్యక్షుడు డిసి లయన్ నీల ప్రవీణ్ కుమార్ గుప్త, నాయకులు ఉప్పల నర్సింలు గుప్త, కోడిప్యాక లక్ష్మణ్ రావు గుప్త, ఉప్పల అశోక్ గుప్త, కమఠాల రాజేశ్వర్ గుప్త, గబ్బుల సిద్దిరాములు గుప్త, కె.నారాయణ గుప్త, తూప్రాన్ పట్టణ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు కోవూరు శ్రీనివాస్ గుప్త, పెద్దిగారి నగేష్ గుప్త, కోడిప్యాక నాగరాజు గుప్త, చంద నారాయణ గుప్త, బి.ఆర్.ఎస్ యూత్ లీడర్ బాబీ నాయుడు, గడ్డం ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking