జగిత్యాల ప్రతినిధి, జులై 14(ప్రజా బలం) ప్రపంచ మానవాళి క్షేమాన్ని కోరుతూ లక్ష్మీపూర్ లోని మహాత్మా జ్యోతిబాపులే బిసి బాలికల గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం పోచమ్మ బోనాలను చేపట్టారు. ప్రిన్సిపల్ మమత నెత్తిన బోనాలను ఎత్తుకొని ముందుకు సాగగా పోచమ్మ బోనాల కార్యక్రమం ఆసాంతం లక్ష్మీపూర్ గ్రామస్తులను ఆకట్టుకొంది. లక్ష్మీపూర్ గ్రామ పోచమ్మ కు గురుకులం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమముతో గురుకుల విద్యా సంస్థ గ్రామ ప్రజల సంక్షేమాన్ని కోరుతున్నారన్న భావన స్థానికుల్లో నెలకొంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మమత మాట్లాడుతూ గ్రామీణ ప్రజల దేవత పొచమ్మ అని ఎందరో విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి గురుకులంలో ఉంటారని వీరందరి గ్రామదేవతను గుర్తుచేసి విద్యార్థుల విశ్వాసాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని అందులో భాగమే పోచమ్మ బోనాలని ప్రిన్సిపాల్ మమతా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల టీచర్స్ తోపాటు విద్యార్థినిలు, సిబ్బంది ఉన్నారు.