ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 6:
భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాచారం డివిజన్ పరిధిలో శక్తికేంద్ర ఇంచార్జ్ ల ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ గారు పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించటం జరిగింది. అనంతరం కార్యకర్తలు, నాయకులతో జరిగిన టిఫిన్ బైటక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గోపాల్ గౌడ్ గారు మాట్లాడుతూ ఏంతో మంది త్యాగమూర్తుల, బలిదానాల ఫలితంగా, నిస్వార్థంగా సేవలందించే కార్యకర్తల కష్టమే నేడు ఈ భారతీయ జనతా పార్టీ విజయానికి కారణం. అదేవిదంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజిగిరి బిజెపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారిని సమిష్టికృషితో గెలిపించుకుని కేంద్రంలో మరోసారి నరేంద్రమోడీ గారి బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు మల్కాజిగిరి స్థానాన్ని బహుమతిగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ లు యోగేశ్వర్ రెడ్డి, గోపి, బూత్ అధ్యక్షులు క్రాంతి కుమార్, వెంకట్ నాయక్, ఉదయ్ రెడ్డి, బాలరాజ్, నారాయణరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.