– యువనేతకు శుభాకాంక్షల వెల్లువ
హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి జూన్ 21
ప్రముఖ సామాజికవేత్త, హెచ్‌సీఎల్ సీనియర్ డైరెక్టర్ సబ్బని వెంకట్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఆయన అనుచరులు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుజూరాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి గ్రామంలో వెంకట్ స్వగృహంలో ఆయన్ను హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక స్పృహ కలిగిన వెంకట్ నాయకుడిగా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పార్టీలకతీతంగా నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, నాయకులు వెంకట్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. సమాజసేవలో తన వంతు పాత్ర పోషిస్తూ.
పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వెంకట్‌ను గ్రామస్తులు అభినందించారు.